
పురపాలక శాఖ కొరకు 13,862 కోట్ల రూపాయలు కేటాయించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్పుల కోసం 3377 కోట్లు కేటాయించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు అందజేస్తామని పేర్కొంది. 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. దీపం పథకం ద్వారా అర్హత ఉన్నవాళ్లకు 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పుకొచ్చారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు ఇస్తామని ఏపీ సర్కార్ తెలిపింది.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించామని మంత్రి అన్నారు. బాల సంజీవని పథకం కోసం ఏకంగా 1163 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం 4,220 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీపం 2.0 పథకానికి ఏపీ సర్కార్ ఏకంగా 2600 కోట్ల రూపాయలు ప్రకటించింది. ఈ స్కీమ్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చనుంది. ఏపీ బడ్జెట్ అన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.