
ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలో బడ్జెట్ ని అమలు చేయబోతున్నారు.ముఖ్యంగా ఈ బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి 50,000 కోట్ల రూపాయల దాకా నిధులు కేటాయించే అవకాశం ఉన్నదట. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, పంటల బీమా తో పాటుగా, వ్యవసాయ యాంత్రీకరణకు, అలాగే ప్రకృతి వ్యవసాయం చేసేందుకు, సూక్ష్మ సేద్యం, పామాయిల్ అభివృద్ధికి విత్తనాల రాయితీలకు సంబంధించి అలాగే మత్స్యకారులకు సంబంధించి మృతి వంటి పథకాలకు కూడా ఇందులో నిధులు కేటాయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఈసారి రైతులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది. మరి ఏ మేరకు రైతులకు గుడ్ న్యూస్ లు తెలియజేస్తారో చూడాలి.
అయితే ఈ బడ్జెట్ ని సైతం ప్రవేశ పెట్టేందుకు ముందే పయ్యావుల కేశవ్ తమ నివాసంలో అధికారులతో కలిసి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారట. ఆ తర్వాత వెంకటంపల్లి లో ఉండే టీటీడీ ఆలయాన్ని కూడా దర్శించుకొని మరి ఈ బడ్జెట్ ని ప్రవేశ పెడుతూ శ్రీవారి పాదాల వద్ద ఉంచి అమలు చేయబోతున్నారట. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సరికొత్త పథకాలతో ముందుకు వెళ్లేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట.