
అదే సమయంలో ఏపీ సర్కార్ టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా శుభవార్త చెప్పింది. టిడ్కో ద్వారా ఏకంగా 2 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించనున్నట్టు బడ్జెట్ ద్వారా వెల్లడించింది. టిడ్కో ఇళ్ల దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు మరింత బెనిఫిట్ కలిగే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేసిందని చెప్పవచ్చు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ విషయానికి వస్తే గ్రామీణ ప్రజలకు తక్కువ ఖర్చుతో గృహాలను అందించాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభమైంది. పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి 2015 సంవత్సరంలో ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ద్వారా ఇంటి నిర్మాణానికి సహాయం చేయడంతో పాటు తక్కువ వడ్డీకే రుణాలు పొందే ఛాన్స్ ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీలతో పాటు వితంతు, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు సహా సమాజంలో వెనుకబడిన, అట్టుడుగు వర్గాల వారి కోసం ఈ స్కీమ్ అమలవుతోంది. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవాళ్లు మాత్రం ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి అర్హులు కారు. పెళ్లైన పిల్లలు ఉంటే కూడా ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందలేరు. ఈ స్కీమ్ లో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పవచ్చు. ఇళ్లు లేని వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం వాళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.