- విద్యా శాఖ‌లో ప‌లు ప‌థ‌కాల‌కు నిథుల వ‌ర‌ద‌

- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కూట‌మి ప్ర‌భుత్వం ఈ రోజు ఏపీ బ‌డ్జెట్ ను శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టింది. ఏపీ ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ఈ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. అయితే ఈ సారి బ‌డ్జెట్ లో విద్య రంగానికి కేటాయింపులు .. విద్య కోసం ఇచ్చిన ప‌థ‌కాల‌కు భారీగా నిధుల కేటాయింపు ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇక ఈ సారి బ‌డ్జెట్ లో ప‌లు విద్య అంశాల‌కు కేటాయింపులు అదిరి పోయాయి. అంద‌రూ ఎంతో ఆస‌క్తి తో వెయిట్ చేస్తోన్న త‌ల్లి కి వంద‌నం ప‌థ‌కాని కి ఏకంగా రూ. 9,407 కోట్లు కేటాయించారు. ఇక వ‌చ్చే యేడాది నుంచి అమ్మ వ‌డి ప‌థ‌కం అమ‌ల్లో కి తీసుకు వ‌స్తామ‌ని విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం అమ‌లు పై ప్ర‌తిప‌క్షా ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఈ సారి ఎలాగైనా అమ‌లు చేస్తామ‌ని లోకేష్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.


బ‌డ్జెట్‌లో విద్యా రంగానికి అంశాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి ...

- ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల కు ఉచిత విద్యుత్
- ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీమ్‌కు రూ.2 వేల కోట్లు
- తొలి సారిగా భాషాభివృద్ధికి నిధుల కేటాయింపు
- తెలుగు భాషా భివృద్ధికి రూ.10 కోట్లు కేటాయింపు
- ఎస్సీ , ఎస్టీ , బీసీ స్కాలర్‌షిప్ లకు రూ. 3,377 కోట్లు
- మన బడి పథకానికి రూ . 3,486 కోట్లు
- తల్లి కి వందనం పథకానికి రూ. 9,407 కోట్లు
- బాల సంజీవని పథకానికి రూ. 1,163 కోట్లు
- పాఠశాల విద్యకు రూ. 31, 806 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి:

AP