ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి కారణమైన కీలకమైన పథకం తల్లికి వందనం అనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ అమలు విషయంలో ఎన్నో సందేహాలు నెలకొనగా బడ్జెట్ అమలు సందర్భంగా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ స్కీమ్ కు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పూర్తిస్థాయిలో చెక్ పెట్టే దిశగా అడుగులు వేశారు.
 
2025 - 2026 విద్యా సంవత్సరానికి తల్లికి వందనం స్కీమ్ కోసం ఏకంగా 9407 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ స్కీమ్ ద్వారా 9407 కోట్ల రూపాయలు అందించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ స్కీమ్ అమలు కానుందని సమాచారం అందుతోంది.
 
అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలకు మేలు జరిగేలా మరో నిర్ణయాన్ని సైతం పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఫ్రీగా విద్యుత్ ను అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీ ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరే విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి కొన్ని షరతులు మాత్రం అమలవుతాయి.
 
పిల్లల హాజరుతో పాటు తల్లీదండ్రుల ఆదాయం ఇతర అంశాలను పరిణనలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. తల్లికి వందనం స్కీమ్ పర్ఫెక్ట్ గా అమలైతే ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. ఏపీ విద్యార్థుల భవిష్యత్తును మార్చే స్కీమ్ తల్లికి వందనం అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించి త్వరలో మరిన్ని కీలక అప్ డేట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్కీమ్ ను పూర్తిస్థాయిలో అమలు చేస్తే 2029 సంవత్సరంలో కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.


 


మరింత సమాచారం తెలుసుకోండి: