
ఇక ఏపీ ప్రభుత్వం 2025 - 26 సంవత్సరానికి .. 3 లక్షల 22వేల 359 కోట్ల అంచనాలతో .. బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది .. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుందని మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు .. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భారీ అపూర్వమైన తీర్పును ఇచ్చారని రాష్ట్ర పునర్నిర్మానంలో ఎన్నో సవాళ్లు ఉన్న ఎంతో గొప్ప పనిగా పేర్కొన్నారు .. అలాగే రాజధాని తిరిగి పట్టాలెక్కిస్తున్నామని కేశవ్ చెప్పుకొచ్చారు.. ఇక ఈ బడ్జెట్లో రెవెన్యూ , వ్యవసాయం అంచనా 2 లక్షల 51 వేల 162 కోట్లు.. కాగా మూలధనం అంచిన 40,635 కోట్లుగా వివరించారు .
అలాగే రెవెన్యూ లోటు 33, 185 కోట్లుగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం . ద్రవ్య లోటు 79,926 కోట్లగా చెప్పుకొచ్చింది . అలాగే సాధారణ బడ్జెట్ తో పాటుగా 48 వేల కోట్లు అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ను కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు .. అలాగే వివిధ ప్రాజెక్టులలో నిధులు కొరతను అధిగమించేందుకు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ 2000 కోట్లుగా ప్రతిపాదించారు .. హౌసింగ్ లో నడుస్తున్న గృహ నిర్మాణానికి ఎస్సీలకు 50,000 రూపాయలు ఎస్టీలకు 70000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు, బిసి వెల్ఫేర్‌కు రూ. 23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ. 19,260 కోట్లు, పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్మెట్రూ. 18,848కోట్లు కేటాయించారు. కాగా, జలవనరుల అభివృద్ది శాఖ రూ. 18,020 కోట్లు, మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్మెంట్ రూ. 13,862 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 13,600 కోట్లు ప్రతిపాదించారు. ఇక.. వ్యవసాయానికి రూ. 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ. 10,909 కోట్లు, ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల కు రూ. 10,619 కోట్లు, రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు ప్రతిపాదించారు.