
రెండు ఎకరాల మాగానీ లేదా ఐదు ఎకరాలు మెట్ట భూమి ఉన్న భూమి యజమానులను ప్రభుత్వ ఉద్యోగులను ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని ఫోర్ వీలర్ వెహికల్ ఉన్న వారిని, 200 యూనిట్ కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని మున్సిపల్ ఏరియాల్లో సొంత ఆస్తి ఉన్న వారిని, ఆర్థికంగా ఉన్నంతగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు .. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది . ఇక దీంతో రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు పీ4 కు అర్హులుగా ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ధారించింది.
లబ్ధిదారులకు ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫామ్‌లో ఆ కుటుంబాల వివరాలు సేకరిస్తారు .. అలాగే లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉండనుంది .. ఇక్కడ ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించదు .. అలాగే మ్యాచింగ్ ఎనేర్జింగ్ ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది . ఇక ఇందులో ఎలాంటి ఒత్తిడి కూడా ఉండరు .. స్వచ్ఛందంగా ఆ కుటుంబాలు వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు కావచ్చును సీఎం చెబుతున్నారు . అయితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో పేదరికం చాలా వరకు తగ్గుముఖం పడుతుందని అంచన వేస్తున్నారు .. ఉన్నత వర్గాల వారు రాష్ట్రంలో ఉన్న పేదల అభివృద్ధికి వారికి సహాయపడే కొత్త కాన్సెప్ట్ గా పీ4 విధానం మరనుంది.