ఆంధ్రప్రదేశ్లో 2025-26 కి సంబంధించిన బడ్జెట్ ని సైతం కొన్ని గంటల క్రితం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ ప్రైవేటు పెట్టడం జరిగింది. సుమారుగా 3.22 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మొదటిసారి పూర్తిస్థాయిలో బడ్జెట్ ను సైతం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఎక్కువగా సంక్షేమ పథకానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పోలవరం కి సంబంధించి 6,705 కోట్ల రూపాయలను కేటాయించారు.


సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన వాటిలో అన్నదాత సుఖీభవకు 20,000 ఇచ్చేదానికి 6,300; కోట్ల ప్రవేశపెట్టారు. అలాగే తల్లికి వందనం కూడా 9,407 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టారు. అయితే స్కూల్లో తెరిచిన తర్వాత విద్యార్థుల తల్లికి వందనం డబ్బులను వేయబోతున్నారట. అలాగే కార్పొరేట్ వైద్యం హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాల పైన ప్రతి ఏడాది కూడా 25 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని వెల్లడించారు.


వీటితోపాటుగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సైతం 200 ఉచిత యూనివర్సిటీ సైతం ప్రభుత్వం అందించేందుకు 400 కోట్లను కేటాయించారు.. అలాగే ఎన్నికల ముందు చేనేత వర్గాల వారికి 200,500 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని చెప్పారు.. అందులో భాగంగా వారికి ఇవ్వడానికి కూడా సిద్ధం అయ్యింది. అలాగే నాయి బ్రాహ్మణులకు కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్ అందించేందుకు సిద్ధమయ్యింది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం బడ్జెట్లో 450 కోట్లను కూడా కేటాయించారట. దీంతో వీరందరికీ ఉచిత కరెంటుగా తెలిపారు.. వీటితోపాటు కుల వృత్తులను సైతం బలోపేతం చేయడానికి మరిన్ని పథకాలను తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తాందట. ఇందుకోసం రూ 1000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ ని కేటాయించినట్లు సమాచారం. ఇలా ఇవే కాకుండా మరెన్నో పథకాలకు ఇతరత్రా వాటికి కూడా కొన్ని కోట్ల రూపాయలను ప్రవేశపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: