ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా పూర్తైతే ప్రజలకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ నేడు ఏకంగా 3.22 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఏపీ సర్కార్ వ్యవసాయానికి ఏకంగా 48,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం గమనార్హం. ఈ స్థాయిలో కేటాయించడం వల్ల రైతులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుంది.
 
అమరావతికి ఏపీ సర్కార్ 6000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులను అదే సంపాదించుకుంటుందని తెలుస్తోంది. గత సర్కార్ విధ్వంస పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని జీతాలు కూడా చెల్లించలేని స్థితికి వెళ్లిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర పునర్నిర్మాణం సవాల్ తో కూడుకుని ఉందని కూటమి నేతలు వెల్లడిస్తున్నారు.
 
బీసీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. 47 వేల 456 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమం కోసం కూటమి సర్కార్ ఖర్చు చేయడం గమనార్హం. బడ్జెట్ లో అమరావతికి అన్యాయం జరిగిందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బడ్జెట్ లో నైపుణ్యాభివృద్ధి శాఖకు ఏకంగా 1228 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం.
 
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ఏపీ సర్కార్ 3486 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏపీ సర్కార్ ఆదరణ పథకం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఏపీ సర్కార్ 27,518 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం ఏపీ సర్కార్ 10 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. ఏపీ సర్కార్ నిర్ణయాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఏపీ సర్కార్ సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేయడం గమనార్హం. ఏపీ సర్కార్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: