ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల బీమా సహాయాన్ని అందించేందుకు కొత్త పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు గాను... ఈ కొత్త పథకాన్ని తీసుకు వస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.


 కాసేపటి క్రితమే ఏపీ బడ్జెట్ ను అసెంబ్లీలో పెట్టిన పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీలోని నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అందుకే 25 లక్షల  ఇన్సూరెన్స్ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చిస్తున్నట్లు వివరించారు పయ్యావుల కేశవ్. ఇక ఈసారి 3.22 కోట్లతో వార్షిక బడ్జెట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం జరిగింది.

 వ్యవసాయానికి 48 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. అలాగే పాఠశాల విద్యకు 31, 806 కోట్లు కేటాయిస్తున్నట్లు... పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. బీసీ సంక్షేమం కోసం 23260 కోట్లు   కేటాయించినట్లు తెలిపారు. బాల సంజీవని ప్లస్ కోసం వేయి 163 కోట్లు.. కేటాయించినట్లు తెలిపారు పయ్యావుల కేశవ్. మత్స్యకార భరోసా కింద 450 కోట్లు... ఇవ్వబోతున్నట్లు వివరించారు.

 అంతేకాకుండా... స్వచ్ఛ ఆంధ్ర కోసం 820 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు పయ్యావుల కేశవ్. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్కు 400 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు.. ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకుగాను 62 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ధరల స్త్రీ కరణ నిధి కోసం 300 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: