ఏపీ సర్కార్ ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ భారీగా అప్పుల అంచనాలతో ప్రవేశపెట్టడంతో పాటు పలు కీలక పథకాలకు చెక్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. నిరుద్యోగ భృతి, మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్స్ కు బడ్జెట్ లో చోటు లేకపోవడం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.
 
అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం స్కీమ్స్ కు సంబంధించిన లబ్ధిదారుల విషయంలో సైతం ఏపీ సర్కార్ భారీగా కోత విధించిందని బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. తల్లికి వందనం స్కీమ్ కోసం 12,000 కోట్ల రూపాయలు అవసరం కాగా కూటమి సర్కార్ కేవలం 8000 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఈ స్కీమ్ కోసం కేటాయించింది.
 
అర్హుల సంఖ్యను భారీగా తగ్గించేలా కూటమి నిర్ణయాలు ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దీపం పథకానికి సంబంధించి కూడా లబ్ధిదారుల సంఖ్యకు బడ్జెట్ కు పొంతన లేదు. డ్వాక్రా మహిళలకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో బాబు సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాత సుఖీభవ స్కీమ్ బడ్జెట్ కూడా పరిమితంగానే ఉంది.
 
అర్హుల సంఖ్య విషయంలో ఏపీ సర్కార్ భారీగా కోతలు విధిస్తే మాత్రం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బడ్జెట్ తో చంద్రబాబు మోసం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పథకాలను అమలు చేసి రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం ఏపీ ప్రభుత్వానికి సైతం సులువు కాదని చెప్పవచ్చు. సరైన ప్రణాళికలతో చంద్ర బాబు నాయుడు  సర్కార్ ముందుకెళ్తే మాత్రమే లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయి.






మరింత సమాచారం తెలుసుకోండి: