
దేశవ్యాప్తంగా 32 వృద్ధాశ్రమాలను సైతం కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలియజేశారు. అందులో 12 ఆంధ్రప్రదేశ్ లో మంజూరు చేసిందని తిరుపతిలో 4, అలాగే వైయస్సార్ జిల్లాలో 2, సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ ,అనకాపల్లి ,మన్యం, పార్వతీపురం వంటి ప్రాంతాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటి వృద్ధాశ్రమాలను మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఈ వృద్ధాశ్రమాలు ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఒక్కొక్క దానికి 25 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. అయితే ఒక్కో వృద్ధాశ్రమంలో కనీసం 25 మంది ఉండాలి అంటూ తెలియజేశారు.
ఇప్పటికే ఏపీలో 68 వృద్ధాశ్రమాలు కూడా స్వచ్ఛందంగా నడుస్తూ ఉన్నాయని ఇవన్నీ కూడా కేంద్ర ఆర్థిక సహాయంతోనే నడిపిస్తున్నారని తెలియజేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం అధ్యయనంలో కూడా చిత్తూరు మచిలీపట్నం వంటి ప్రాంతాలలో కూడా నడుస్తూ ఉన్నాయని తెలిపారు. వీటికి తోడు మరొక వంద ప్రైవేట్ నిర్వహణలో కూడా పలు రకాల వృద్ధాశ్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయని తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. మరి ఏ మేరకు కూటమి ప్రభుత్వానికి వృద్ధుల వృద్ధాశ్రమాల వల్ల ప్లస్ అవుతుందో చూడాలి మరి.. ఇప్పటికే వృద్ధులకు సంబంధించి అన్నిటిలో కూడా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.