
అయితే అలాంటి పరిస్థితి ఇండియాలో లేదని ఎందుకంటే.. మనదేశంలో పోరంబోకు భూములు, పహాని భూములను, పట్టా భూములను ఇలా ఎన్నో రకాల భూములు ఉన్నాయి. ఎవరి భూమి ఏంటి అన్న విషయం పైన ఎప్పుడూ కూడా లిటిగేషన్సే ఉంటాయి.. ఇప్పటికీ భూముల గురించి కొన్ని లక్షల కేసులు నడుస్తూ ఉన్నాయట. వీటివల్లే ఎవరూ కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టలేదట. ఆ లిటికేషన్ సొల్యూషన్ కోసమే రీ సర్వే చేసి ఎవరి భూమి ఎవరిదనే విషయాన్ని ఫైనల్ గా చేసి ఇవ్వడం జరిగిందట.
అయితే ఇంతకాలం మోసంగా ఎవరైనా ఇతరుల భూమిని కొట్టేసిన.. లేకపోతే దొంగ పాసుబుక్కులు సృష్టించిన రీ సర్వేలో బయటపడుతుందట. అయితే పాసు పుస్తకం మీద జగన్ ఫోటో, సర్వే రాళ్ల మీద జగన్ ఫోటో ఉండడం వల్లే జగన్ మీద కూటమి నేతలు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పిన చివరికి రీసర్వేని మాత్రం ఎవరు ఆపలేరని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రి సర్వే చేసిన రాష్ట్రాలకు నజరానా కూడా ఇవ్వబోతోందట. అందుకే మొన్ననే 400 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వానికి వచ్చాయట.. రీ సర్వే మొదటి దశ పూర్తి అయినందుకు గాను ఇచ్చారట. ఫైనల్ గా రి సర్వే అనేది మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలట.