
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలను చీల్చి చెండాడడం... అలాగే తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చడం... అలాంటి అంశాలను ఎజెండాగా పెట్టుకొని టిపిసిసి విస్తృతస్థాయి కార్యవర్గం సమావేశం అయింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కూడా... రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అందరూ తమ తమ అభిప్రాయాలను ఈ పీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో తెలియపరిచారు.
అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన అద్భుతాలను... విజయాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి కచ్చితంగా న్యాయం చేయాలని ఆయన కోరారు. దాదాపు 10 సంవత్సరాల పాటు... కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు చాలామంది... కష్టపడ్డారన్నారు. అయితే ఆయన మాట్లాడుతూ... ఈ సమావేశంలో జై జగన్ అనే నినాదాన్ని ఇచ్చారు. దింతో కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ జై జగన్ నినాదం వైరల్ గా మారింది.
జై జగన్ అంటూ కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ నినాదం ఇవ్వడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలందరూ... ఒకసారి గా షాక్ అయ్యారు. ఏంటి ఈయన జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారని... అవాక్కయ్యారు. మొత్తానికి ఈ ఎపిసోడ్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రికార్డు ఇవాళ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పలకడమే మర్చిపోయారు. అటు యాంకర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ.. వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యకాలంలో.. ఇలాంటి పరాభావాలు ఎదురవుతున్నాయి.