
సెకీకి సంబంధించి అదానీ కుంభకోణంలో జగన్ కు ముడుపులు ముట్టాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. ఇందులో ఊహించని ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం సెకీ జగన్ ప్రభుత్వం పాలనలో ఒప్పందం చేసుకున్న విధంగానే 2 రూపాయల 49 పైసలకు విద్యుత్ ను కొనుగోలు చేస్తుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జగన్ పరువు నష్టం దావా వేశారు.
అయితే కపిల్ సిబాల్ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ జగన్ తప్పు చేశారనే విధంగా కామెంట్లు చేయడం ఒకింత సంచలనం అవుతోంది. మరోవైపు జగన్ తరపు లాయర్ మాత్రం తాము కౌంటర్ వేయడానికి కొంతమేర సమయం కావాలని కోరినట్టు సమాచారం అందుతోంది. ఈ కేసు వాదనలు ఏపీ హైకోర్టులోనే జరగాలని కూడా ఏపీ ప్రభుత్వం తరపు లాయర్ కోరారు.
అందువల్ల ఈ కేసులో రాబోయే రోజుల్లో ఊహించని మలుపులు చోటు చేసుకోవడం మాత్రం పక్కా అని అందుకు సంబంధించి ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. జగన్ తలచుకుంటే కూటమి సర్కార్ ను ఇరుకున పెట్టడం కష్టం కాదని అయితే సరైన రీతిలో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.