ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కరెంటు చార్జీలు పెంచారని , రైతులకు మద్దతు ధర లేదంటూ వాదన వినిపిస్తోంది ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లోని వాహనదారులకు సైతం హెచ్చరిస్తూ ఈ రోజు నుంచి కొన్ని నిబంధనలను విధిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాహనదారులు నడిపే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు తెలియజేస్తోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూసి సామాన్యులు కూడా బిత్తరపోయేలా కనిపిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్లో వాహనాలు నడిపేవారు కచ్చితంగా ఆర్సి, లైసెన్స్, ఇన్సూరెన్స్ తో సహా అన్ని పత్రాలను కచ్చితంగా తమ వద్ద పెట్టుకోవాలని హెల్మెట్ తీసుకొని వెళ్లాల్సిందిగా తెలియజేశారు. రాష్ట్రంలో వాహనదారులు వాహనాలు నడిపే ద్విచక్ర వాహనాలు, లారీలు, కార్లు ఇతరత్రా వాహనాలు చట్ట ప్రకారమే కఠినంగానే వ్యవహరిస్తామంటూ పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ నిబంధనల పైన అవగాహన కల్పించామంటూ తెలియజేశారు. రేపటి నుంచి భారీగా జరిమాణాలు ఉంటాయని పోలీసులు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైనా ఏ నిబంధన అయినా సరే ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధిస్తారో కూడా తెలియజేయడం జరిగింది.


దీని ప్రకారం హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే అలాగే వెనుక సీట్ల కూర్చున్న వారికి సైతం వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారట.. అలాగే ఇన్సూరెన్స్ లేకుండా వాహనం ఎవరైనా నడిపితే ఫస్ట్ టైం 2000, రెండోసారి ₹4,000 వేస్తారట. లైసెన్స్ లేకుండా నడిపితే 5000 రూపాయల వరకు జరిమానా ఉంటుందట. అలాగే పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా లేకపోతే 1500 ఉంటుంది. మొబైల్ మాట్లాడుతూ సెల్ఫోన్ ఉపయోగిస్తే 1500 రెండవసారి అయితే 10,000  వరకు విధిస్తారట. ఆటోలు నడిపేవారు యూనిఫాం లేకుండా నడిపితే 150 రూపాయలు, రెండవసారి దొరికితే 300 రూపాయలు ఉంటుందట.


వాహనాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఎవరైనా సరే నడిపారంటే 2000 నుంచి 5000 రూపాయల వరకు జరిమానా విధిస్తారట. అతివేగంగా వాహనం నడిపితే 1000 రూపాయలు బైక్ పైన త్రిబుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయలు ఉంటుందట.ఇకమీదట వీటన్నిటిని పాటిస్తూ వాహనాలు నడపాలంటూ పోలీసులు స్పష్టం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: