- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రస్తుతం ఏపీలో మరో ఎన్నికలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 20న పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటాలోనే ఉన్న నేపథ్యంలో వైసిపి దాదాపు ఈ పోటీలో ఉండకపోవచ్చు అన్న చర్చ సాగుతోంది. ఐదు స్థానాలు కూడా కూటమీ ఖాతాలోనే పడతాయి. ఐదు స్థానాలలో ఒకటి ఇప్పటికే జనసేన కు రిజర్వ్ అయింది .. మరో సీటు బిజెపికి ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇక జనసేన కి ఇచ్చే సీటులో నాగబాబు పోటీ చేయటం ఖాయం అయింది. గతంలోని నాగబాబు ని మంత్రివర్గంలో కి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన నేప‌థ్యంలో ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీలలో ఒకటి జనసేనకు కేటాయించి .. ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారని అంటున్నారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో ఎవరు బ‌రిలో ఉంటారని ఆసక్తిగా మారింది. మైలవరం టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు .. పిఠాపురం టికెట్ త్యాగం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు రేసులో ఉన్నాయి. ఇద్దరికీ చంద్రబాబు ఎంఎల్సి ఇస్తామని బలమైన హామీలు ఇచ్చారు.


పిఠాపురం వర్మ విషయానికొస్తే ఆయనకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే పిఠాపురంలో అధిపత్య‌ పోరు పెరుగుతుందన్న కంప్లైంట్లు జనసేన నుంచి వస్తున్నాయట. అదే జరిగితే మరో రెండు ఏళ్లపాటు వ‌ర్మ కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకపోవచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. మరి అదే జరిగితే వర్మ సైలెంట్ గా ఉంటారా అన్నది కూడా చూడాలి. ఏదేమైనా పిఠాపురం లో ఇప్ప‌టికే టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన అన్న‌ట్టు గా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. వ‌ర్మ‌కు ఎమ్మెల్సీ ఇస్తే మ‌రో ప‌వ‌ర్ సెంట‌ర్ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి బాబు ఏం చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: