
వైసీపీలో ఏం చేయాలి నాయకులు ఎలా ఉండాలి ? ఏ సమయానికి ఎలా మాట్లాడాలి ? ఎవరు మాట్లాడాలి ఇలా ఇవన్నీ కూడా సలహాదారులే నిర్ణయించారు. గతం లో రాజకీయ సలహాదారులు ప్రభుత్వ సలహాదారులు ఉండేవారు . . వారే అన్ని డిసైడ్ చేసేవారు. ఇప్పుడు వైసిపి విపక్షంలోకి వచ్చేసింది. చాలామంది సలహాదారులు వెళ్లిపోయాక ఇప్పుడు ఉన్నవారు కూడా అంతర్గతంగా ఉంటున్నారు. ఇప్పుడు మిగిలిన ఆ నలుగురు సలహాదారుల ముచ్చట పార్టీలు ఆసక్తి గా మారింది రామకృష్ణారెడ్డి మరోసారి పార్టీలో చక్రం తిప్పుతున్నారని చర్చ సాగుతోంది. ఈయన సలహా మేరకే పార్టీ నాయకులు వ్యవహారాలు నడుస్తున్నాయట. ఇది పార్టీకి పెద్ద మైనస్ గా మారింది అన్న చర్చ నడుస్తోంది. మండలిలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న బొత్స సత్యనారాయణ చూసు కోవలసిన విషయాలలో కూడా ఓ కీలక మాజీ సలహాదారు జోక్యం చేసుకొని కొందరికి మాత్రమే అవకాశం వచ్చేలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నాయకులు అందరూ అసహనంతో ఉన్నారు.
సభలలో మాట్లాడే అవకాశం కోసం ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విషయంలో కొందరు పోటీ కూడా పడతారు. ఇలాంటి వారికి కూడా అవకాశం లేకుండా కొందరు మాత్రమే ప్రత్యేకంగా మాట్లాడాలి అంటూ వైసీపీలో ఆ సలహాదారు ప్రత్యేకంగా ఎంపిక చేస్తున్నారని .. అలా అయితే తాము ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా కొనసాగడం ఎందుకు అన్న అసహనం ? వైసీపీకి చెందిన నేతలలో కనిపిస్తోంది ఇదే పరిస్థితి కొనసాగితే వైసిపిలో అంతర్గత కుమ్ములాటలు పెరిగి ... పార్టీకి మరింత నష్టం వాటిలో అవకాశం ఉందని సొంత పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా సలహాదారుల వ్యవహారం మరోసారి పార్టీని కుదిపేస్తుంది. మరి జగన్ ఈ విషయం లో ఏ నిర్ణయం తీసుకుంటాడో ? చూడాలి.