
అలాగే గోరంట్ల మాధవ్ కు పంపించిన నోటీస్ కూడా ఐదేళ్ల క్రితం మాట్లాడిన మాటలు పైన కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో అధికారం ఉందనే విధంగా ప్రవర్తించారనే విధంగా కేసు వేయడం జరుగుతోందట. అప్పట్లో ఉద్యోగులు ఇలా ప్రవర్తించారని కేసులు లేకపోతే యాక్షన్స్ వంటివి తీసుకుంటూ ఉన్నది కూటమి ప్రభుత్వం. అయితే వీటిని కూటమికి అనుకూల మీడియా పత్రికలు మీడియా కూడా సమర్థిస్తూ ఉన్నాయి. జగన్ అనేవారు అధికారంలోకి రారు లేకపోతే రానీయము అనుకుంటే కూటమి ఏం చేసినా చెల్లుతుంది..
జగన్ అనేవారు అధికారంలోకి వస్తే.. వీరు చేసిందే మళ్ళీ తిరిగి చేస్తారు.. అందరి అధికారుల మీద యాక్షన్ ఉంటుంది. పోలీసులందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఒకవేళ జగన్ రాకపోయినా.. సఫరింగ్ లో ఉన్న జగన్ జీవితకాలం రాజకీయాలను వదిలేసి ఉంటారా? ఇతర పార్టీలోకి వెళ్లారా..?.. ఒకవేళ రేపటి రోజున వచ్చే ప్రభుత్వానికి క్లియరెన్స్ ఇచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు రాసిన ఇప్పుడు ఎం చేసినా చెల్లుతుంది..అప్పుడు ఏమైనా జరగవచ్చు.. అప్పుడు కూడా ఇప్పుడు ఎలా రాశారో మీడియా సంస్థలు అలాగే రాయాలిసి ఉంటుంది. ప్రతీకారం కాదు ఇది.. సరైన యాక్షన్ తీసుకున్నారని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న వారందని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తే.. ఇది ప్రతి కార రాజ్యం ఇది తప్పని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అన్న వారిని ఇప్పుడు యాక్షన్ తీసుకుంటూ ఉన్నప్పటికీ ఇది ప్రతికార రాజ్యం కాదు కరెక్ట్ అని రాస్తున్నాయట. మరి మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా అనగలుగుతారా.. రాయగలుగుతారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.