కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడం జరిగింది. కాసేపటి క్రితమే పార్టీ నుంచి... తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అధికారిక ప్రకటన కూడా చేశారు. గత కొన్ని రోజులుగా... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న మాట్లాడడంపై... తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది అధిష్టానం.


 తన యూట్యూబ్ ఛానల్ లో... కాంగ్రెస్ పార్టీని బండ బూతులు తిడుతూ... చాలాసార్లు రెచ్చిపోయి మాట్లాడారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అలాగే పలు బిసి బహిరంగ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి రాజ్యం నడుస్తోందని కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే... తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చాలామంది ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని ఫిబ్రవరి 5వ తేదీన తీన్మార్ మల్లన్నకు నోటీసులు కూడా పంపింది టిపిసిసి.

 అయితే ఆ నోటీసులపై... తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా... లొట్ట పీస్ నోటీసులు.. మీడియా ముందే రెచ్చిపోయి మరోసారి తీన్మార్ మల్లన్న మాట్లాడడం జరిగింది. ఇలా వరుసగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా... మాట్లాడడం... ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది కాంగ్రెస్ హై కమాండ్.

 తాజాగా తెలంగాణ ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకు కూడా తీన్మార్ మల్లన్న విషయంపై ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న ఇన్చార్జి పట్టించుకోకపోవడంతో మీనాక్షి నటరాజనుకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే వెంటనే ఏఐసీసీ నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ ఆదేశాలను నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ పిసిసి.

మరింత సమాచారం తెలుసుకోండి: