వైసీపీ పార్టీ మద్దతు దారులు, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు పోసాని కృష్ణ మురళికి ఊహించని పరిణామం ఎదురైంది. పోసాని కృష్ణ మురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ తరుణంలోనే... అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసాని కృష్ణ మురళికి  వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాసేపటి క్రితమే... పోసాని కృష్ణ మురళికి ఈ సి జి పరీక్ష నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. బ్లడ్ టెస్టింగ్ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది.. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళికి స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. గతం నుంచి గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నారు పోసాని కృష్ణ మురళి. ఇక నిన్న విరేచనాలకు గురయ్యారు పోసాని.  ఈ తరుణంలోనే... రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోసానికి ఈసీజీ పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఈసీజీ పరీక్షలలో స్వల్ప తేడా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. ఇక మెరుగైన వైద్యం కోసం పోసాని కృష్ణ మురళిని కడపకు తరలించే అవకాశం
ఉందని సమాచారం అందుతోంది.

ఇక వైసీపీ పార్టీ మద్దతు దారులు, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు పోసాని కృష్ణ మురళికి తీవ్ర అస్వస్థత అన్న వార్త బయటకు రావడంతో... ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి బయలు దేరారు. అయితే.. నటుడు పోసాని కృష్ణ మురళిని చూసేందుకు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.


కాగా... వైసీపీ పార్టీ మద్దతు దారులు, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు పోసాని కృష్ణ మురళిని శివరాత్రి రోజున హైదరాబాద్‌ లోనే ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం.. ఏపీకి పోసానిని తరలించారు. ఇక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో.... జైలు కూడు తింటున్నారు పోసాని. గతంలో అంటే జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే... చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ ను బండ బూతులు తిట్టారు పోసాని. ఆ కేసులలో భాగంగా ఆయనను అరెస్ట్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: