ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు వల్లభనేని వంశీ గురించే అందరూ మాట్లాడుకున్నారు. కానీ తాజాగా పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ కావడంతో... టాపిక్‌ పోసాని వైపునకు వచ్చింది. అయితే.. ఇలాంటి తరుణంలోనే... అనుభవించు రాజా...అంటూ పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌ పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.


అనంతపురం జిల్లాలో  హోం మంత్రి అనిత మాట్లాడారు. తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమిలో ఎలాంటి అంతరుద్ద్యం లేదని క్లారిటీ ఇచ్చారు.  వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా వైసిపి నాయకులు చూసుకోవాలని సెటైర్లు పేల్చారు హోం మంత్రి అనిత.  నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదని వార్నింగ్‌ ఇచ్చారు హోం మంత్రి అనిత. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం అన్నారు.


వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదని వార్నింగ్‌ ఇచ్చారు... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు హోం మంత్రి అనిత. రెడ్ బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడపై తిరగలేరని హెచ్చరికలు జారీ చేశారు. పోసాని కృష్ణ మురళిపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయన్నారు.


కక్షపూర్తి రాజకీయాలు చేయడం లేదు... అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని తెలిపారు హోం మంత్రి అనిత. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.... అనుభవించేది రాజానేనని సెటైర్లు పేల్చారు. పోలీస్ శాఖలో 900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారన్నారు. అవన్నీ మేము తీరుస్తున్నామని చెప్పారు. ఇంతవరకు ఏపీకి గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని వెల్లడించారు హోం మంత్రి అనిత.  ఇకనైనా వైసీపీ పార్టీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: