ఏపీ చిన్నారులకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. చిన్న పిల్లల పేరుతో 2 లక్ష ల పిక్స్ డే డిపాడిజిట్ చేస్తామని ప్రకటించారు. చిత్తూరు జీడీ నెల్లూరు ప్రజావేదిక సభలో చంద్రబాబు మాట్లాడారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు.గత ఐదేళ్లలో లేని సంతోషం ప్రజల్లో కనపడుతోందన్నారు.నెలకు 8 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని గుర్తు చేశారు బాబు. తలసేమియా, డయాలసిస్ రోగులకు నెలకు 10 వేలు ఇస్తున్నామన్నారు.


నెలకు 2800 కోట్లు, ఏడాదికి 33 వేల కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. జీడీ నెల్లూరు లో తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిన ఇద్దరు ఆడ పిల్లలను ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పిల్లల అమ్మమ్మకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆదేశించానని భరోసా కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వైసిపి నాశనం చేసిందని ఫైర్‌ అయ్యారు.

మేం అధికారంలోకి రాగానే... పెన్షన్ నాలుగు వేలకు పెంచామని గుర్తు చేశారు.  ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచుతున్నామన్నారు. మరింత స్పీడ్ గా అభివృద్ధి, సంక్షేమం లో వెళతామని ప్రకటించారు.  ఐదేళ్ళుగా రాష్ట్రాన్ని వైసిపి దోచుకుందని ఆగ్రహించారు బాబు. ల్యాండ్ టైటిల్ రద్దు చేశాము‌.. పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్రవేసి ఇస్తామని తెలిపారు.  మే లోగా తల్లికి వందనం ఇస్తామన్నారు.


తల్లికి వందన కిందా త్వరలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15వేలు ఇస్తామని స్పష్టం చేశారు బాబు. మేము వచ్చిన తోమ్మిది నెలలో 12.9శాతం వృద్ది రేటు సాదించామని వెల్లడించారు. నాగరికత ప్రపంచంలో పారిశుధ్యం చాలా ముఖ్యమని చెప్పారు. మరో రెండు నెలలో రోడ్లుపై ఉన్న  గుంతలు పూడ్చడం పూర్తి అవుతుందన్నారు.  ‌ఆరు లక్షల వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి....ఆ పనులు ప్రారంభం అయితే ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని బాబు చెప్పారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: