కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంపై... తీన్మార్ మల్లన్న బృందం స్పందించింది. ఆయన పాత వీడియోను ఇప్పుడు.. సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తుంది తీన్మార్ మల్లన్న బృందం. ఏం పీక్కుంటారో పీక్కోండి... అంటూ గతంలో తీన్మార్ మల్లన్న అన్న వ్యాఖ్యలను... కాంగ్రెస్ అధిష్టానానికి కౌంటర్ గా రిలీజ్ చేశారు. సింహం బోనులో ఉన్నంత సేపు సైలెంట్ గా ఉంటుందని... అదే సింహం బయటికి వస్తే.. వేట మొదలు పెడుతుంది... కాంగ్రెస్ అధిష్టానానికి గట్టి కౌంటర్ ఇచ్చింది తీన్మార్ మల్లన్న టీం.


ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై సస్పెన్షన్ వేటు వేసింది అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా కొత్తగా మీనాక్షి నటరాజన్  రావడంతో.. వెంటనే ఆమె యాక్షన్ తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన... గీత దాటిన ప్రతి ఒక్కరిపై వేటు వేసేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న రెండో రోజే తీన్మార్ మల్లన్న పై చాలామంది కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారట. దీంతో.. సీరియస్ అయిన మీనాక్షి నటరాజన్... వెంటనే పార్టీలోంచి పీకేశారు.

ఈ మేరకు తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా... తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఒక లేఖ విడుదల చేశారు. ఈ లేఖను విడుదల చేయడమే కాకుండా ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందని దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. గతంలో తీన్మార్ మల్లన్న రెచ్చిపోయి కాంగ్రెస్ పార్టీని దూషించాడని... మహేష్ కుమార్ ఫైర్ అయ్యారు. అలా చాలాసార్లు మాట్లాడితే సోకజ్ నోటీసులు కూడా ఇచ్చినట్లు గుర్తు చేశాడు.

 పద్ధతి మార్చుకోవాలని చాలా చక్కగా చెప్పినట్లు వెల్లడించారు టిపిసిసి అధ్యక్షులు మహేష్. అయితే ఫిబ్రవరి 5వ తేదీ న తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఫిబ్రవరి 12వ తేదీ లోపు.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దానిపై క్లారిటీ ఇవ్వాలని.. డెడ్ లైన్ పెడితే తీన్మార్ మల్లన్న మరింత రెచ్చిపోయాడని.... మండిపడ్డారు మహేష్ కుమార్. అందుకే కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ అయి.. వెంటనే పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న తొలగించినట్లు వెల్లడించారు. ఇలా ఎవరు చేసిన తోక కత్తిరించడం గ్యారంటీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: