
తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో.. కొత్త పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. తాజాగా కొత్త పార్టీ పెట్టిన హీరో విజయ్... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ పెట్టిన విజయ్... ప్రశాంత్ కిషోర్ వ్యూహ కర్తగా పెట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత వ్యూహకర్త అవతారం ఎత్తిన ప్రశాంత్ కిషోర్.. తమిళనాడులో తన పని ఇప్పటికే మొదలుపెట్టాడు.
తమిళనాడులో విజయ్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనే దానిపైన కసరత్తులు చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్. స్టాలిన్ ప్రభుత్వాన్ని కూల్చి... విజయ్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా... కొత్తగా పొత్తు రాజకీయాలను తెరపైకి తీసుకువచ్చారు. స్టాలిన్ కు వ్యతిరేకంగా ఉన్న అన్న డీఎంకే పార్టీతో... విజయ్ పార్టీని పొత్తుకు అంగీకరించేలా చర్యలు తీసుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కలిసినట్లుగా... తమిళనాడులో కూడా పలని స్వామి, హీరో విజయ్ లను కలిపేలా ప్లాన్ చేస్తున్నారట. గెలిశాక...సీఎంగా పళని స్వామి..విజయ్ డీప్యూటీ సీఎం పదవులు పంచుకునేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం తమిళనాడులో అన్న డీఎంకే పార్టీకి దాదాపు 25% ఓటింగ్ ఉంటుంది. ఇటు విజయ్ పార్టీకి 20% వచ్చిన... మిగతా చిన్న పార్టీలను కలుపుకుంటే 50% నిండుతుంది. 50% ఓట్ పర్సంటేజ్ దాటితే కచ్చితంగా.... విజయ్, అన్న డీఎంకే అధికారంలోకి రావడం గ్యారంటీ అని ప్రశాంత్ కిషోర్ లెక్కలు వేసుకుంటున్నారట.
ఒకవేళ ఈ కాన్సెప్ట్ ఓకే అయితే... వెంటనే అమలు కూడా చేయబోతున్నారట. ఈ మేరకు హీరో విజయ్తో చర్చలు కూడా చేస్తున్నారట ప్రశాంత్ కిషోర్. హీరో విజయ్ సింగిల్ గా బరిలోకి దిగితే... గెలవడం కష్టతరం అవుతుందని ఇప్పటికే చెప్పారట. అనుభవమున్న అన్న డీఎంకే పార్టీతో కలిసి వెళ్తే బెటర్ అని.. సూచనలు చేస్తున్నారట. మరి దీనిపై హీరో విజయ్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.