
అలాగే అలీ కూడా... వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పోసాని కృష్ణమురళిని తాజాగా అరెస్టు చేసింది కూటమి ప్రభుత్వం. పాత కేసులు ముందుకేసి... శివరాత్రి రోజు అర్ధరాత్రి ఎత్తుకెళ్లింది. హైదరాబాదులో ఉన్న పోసాని కృష్ణమురళిని... కట్టు బట్టలతో తీసుకువెళ్లింది ఏపీ సర్కార్. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పోసాని కృష్ణమురళి కాస్త ఓవర్గా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో... వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం ఇటీవల అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కేవలం నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వల్లభనేని వంశీ.. బండ బూతులు తిట్టారు.
ఈ తరుణంలోనే పాత కేసులు ముందుకేసి.. వల్లభనేని వంశీని జైలుకు పంపింది కూటమి ప్రభుత్వం. అలాగే... వైసిపి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు కూడా తాజాగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వల్లభనేని వంశీ అలాగే గోరంట్ల మాధవ్ అంటే టిడిపి క్యాడర్ కు అస్సలు పడదు. అందుకే టిడిపి క్యాడర్ పగ చల్లార్చి వాళ్లను సంతృప్తి.. చేసేందుకు గాను ఆ ఇద్దరినీ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇలా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.