ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పనిని చేయడానికి సమయాన్ని తీసుకొని మరి చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఆశ వర్కర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆశ వర్కర్లకు మొదటి రెండు ప్రసవాలకు సైతం 150 రోజులు వేతనంతో కూడినటువంటి సెలవులను మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నది కూటమి ప్రభుత్వం. దీంతో కూటమి ప్రభుత్వం పైన ఆశ వర్కర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


అలాగే ఆశ వర్కర్లకు సైతం గరిష్ట వయోపరిమితిని కూడా పెంచినట్లు తెలియజేశారు. అంగన్వాడి కార్యకర్తలతో సమానంగానే 62 సంవత్సరాల కు సీఎం చంద్రబాబు పెంచేల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆశ కార్యకర్తలందరికీ కూడా ప్రయోజనం చేకూర్చేలా రూల్స్ ప్రకారమే గ్రాడ్ డ్యూటీ చెల్లించబోతున్నట్లు తెలియజేశారు. ఆశా వర్కర్లకు ప్రతినెలా కూడా పదివేల రూపాయలు వేతనాన్ని ఇవ్వబోతున్నారట. ఇక చివరిగా వారు రిటైర్డ్ అయ్యే సమయానికి 1.5 లక్షల రూపాయలు అందించేలా సదుపాయాన్ని కల్పించారు ఏపీ సీఎం చంద్రబాబు.


ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉండే 42,752 మంది ఆశా వర్కర్లకు సైతం ఉపయోగపడబోతోంది అలాగే గ్రామీణ ప్రాంతాలలో 37,017 మంది ఉన్నారని.. పట్టణాలలో 5,735 మంది ఉన్నారని తెలియజేస్తున్నారు ఇందుకు సంబంధించి త్వరలోనే అన్ని ఉత్తర్వులను కూడా పంపించబోతున్నట్లుగా తెలియజేయడం జరిగింది సీఎం చంద్రబాబు. దీంతో ఆశ వర్కర్లు సైతం సీఎం చంద్రబాబుని మెచ్చుకుంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఆశ వర్కర్లకు జీతాలు ఏమైనా పెంచుతారేమో చూడాలి మరి.


ఇటీవలే బడ్జెట్ సమావేశాలలో కూడా సీఎం చంద్రబాబు తాము ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అందులో భాగంగా కొన్ని పథకాలను అమలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: