కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డకు మహిళలకు సైతం రక్షణ కల్పించే బాధ్యత తమదే అంటూ గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు భరోసా ఇస్తూ పలు రకాల ప్రకటనలు కూడా చేయడం జరిగింది. దీంతో చాలామంది మహిళలు కూడా ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ మాటలను నమ్మినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజస్వరూపం బయటపడినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది మహిళల పై అత్యాచార సంఘటనలు వెలుగులోకి రావడమే కాకుండా చాలామంది మహిళలు తమకు అన్యాయం జరుగుతూ ఉన్న జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోలేదని విధంగా ఆవేదనను తెలియజేస్తున్నారు.



దీంతో చాలామంది పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు అసలు పొంతన లేకుండా పోయింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.గత కొంతకాలంగా సుగాలి ప్రీతి కేసు కూడా ఏమయిందనే విషయంపై ఇప్పటివరకు ఏ విధమైనటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఒక తల్లి కూతురు కలిసి ఆత్మహత్యానికి పాల్పడినట్లు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


అసలు విషయంలోకి వెళ్తే జనసేన పార్టీ సీఎం చంద్రబాబు కార్యాలయానికి తిరిగి తిరిగి అలసిపోయామని డిప్యూటీ సీఎం తమకు న్యాయం చేస్తారని ఆశించిన అలా జరగలేదని తెలిపారు.. ఈరోజు తన కూతురు చావడానికి విషయం తీసుకున్నదని తన బిడ్డతో పాటు తాను మరణిస్తానని తెలిపింది.. అలాగే పబ్లిషర్ చక్రవర్తి, తన భర్త శివ నాగరాజు, మరిది శివకృష్ణ, తన అత్తమామలు కలిసి తమను వేధిస్తున్నారని 10 లక్షల రూపాయలు అదనంగా కట్నం తేవాలని హింసిస్తున్నారని ఈరోజు కూడా తన పిల్లల్ని తనని బెదిరిస్తున్నారని తెలియజేసింది ఆ బాధ్యత మహిళ. మేము వాళ్ళ ఇంటి ముందే వెళ్లి చస్తామని మా చావుకి వీరు 5 మందే కారణమని తెలిపారు.

పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన డబ్బు తీసుకొని పోలీసులు వారిని వదిలేస్తున్నారని.. ఏ ఎమ్మెల్యే ఏ నాయకుడు మాకు ఎవరు ఏమి చేయరు మేము చస్తున్నాము అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా చూడాలని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: