
కేఏ పాల్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు.. గతంలో 50 రూపాయల మందు 150 రూపాయలకే అమ్ముతున్నారని జగన్ మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలియజేస్తూ ఇప్పుడు మీరు కల్తీ మందు వాళ్లకంటే మీరు చాలా దారుణంగా రేట్లలో అమ్ముతున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ కావడం జరిగింది.. అలాగే పవన్ కళ్యాణ్ గతంలో చేసిన 30,000 మంది అమ్మాయిల మిస్సింగ్ వ్యాఖ్యలను కూడా తెలియజేస్తూ 30 వేల మంది అమ్మాయిలను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెతికి తీసుకువస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిల సంగతేంటి అంటూ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ నే కాకుండా చంద్రబాబు పైన కూడా విమర్శిస్తూ ఖజానా ఖాళీ అయిందని ఏడుస్తున్నాడు అప్పులు ఉన్నప్పుడు హామీలు ఇచ్చే ముందు తెలియదా అంటూ సీఎం చంద్రబాబు పైన ఘాటుగా ప్రశ్నించారు కేఏ పాల్. కేఏ పాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పలు రకాల వీడియాలలో వైరల్ గా మారుతున్నాయి.అయితే కేఏ పాలన మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఆయన ప్రశ్నిస్తున్నది సరైనదే అంటూ సపోర్టు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూసి కే ఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గుర అయ్యేలా చేస్తూ ఉన్నాయి. మరి ఈ విషయాల పైన అటు సీఎం డిప్యూటీ సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.