తెలంగాణ రాష్ట్రంలో మరో సరికొత్త రాజకీయ పార్టీ తెరపైకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీసీ కార్డుతో తెలంగాణ రాష్ట్రంలో... రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుందట.  తాజాగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీ కార్డుతో సరికొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట తీన్మార్ మల్లన్న. బీసీ నేతలు అందరినీ కలుపుకొని కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు... అడుగులు వేస్తున్నారట.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులు ఎక్కువగా ఉన్నారు. అటు గులాబీ పార్టీ అంటే రావుల పార్టీ అని... ఇప్పటికే జనాల్లోకి ఓ సంకేతం వెళ్ళింది. తెలంగాణ రాష్ట్రంలో 50 కి శాతం పైగా బీసీలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయ పార్టీ కోసం... కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.

 
ఇందులో భాగంగానే కావాలనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకున్నారట తీన్మార్ మల్లన్న. ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత.... బీసీ లో నినాదం ఎత్తుకున్నారు తీన్మార్ మల్లన్న. అప్పటివరకు కాంగ్రెస్లో ఉంటూనే... రెడ్డి నాయకులను జోకారు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవి వచ్చిందో అప్పుడు... ప్లేట్ ఫిరాయించారు తీన్మార్ మల్లన్న. బీసీ నినాదం ఎత్తుకొని.... కాంగ్రెస్ నేతలను అలాగే సీఎం రేవంత్ రెడ్డి ని బండ బూతులు తిట్టారు తీన్మార్ మల్లన్న.


ఇక ఇప్పుడు... బీసీ నినాదంతో బయటికి వచ్చి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారట. అయితే ఇదంతా గులాబీ పార్టీకి చెక్ పెట్టేందుకు అని... వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి తీన్మార్ మల్లన్న ను నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ ఓట్లను చీలిస్తే.. గులాబీ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని.. అందుకే కొత్త పార్టీ వైపు తీన్మార్ మల్లన్న తో ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో... తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR