
అందుకే ఈ సమయంలోనే కార్యకర్తలను కలవడానికి వచ్చాను అంటూ రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ అసలు ఉండదంటూ కూడా తెలియజేయడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు సైతం క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలు కష్టాలను తెలుసుకోవాలని ఏసీ గదులలో ఉంటే ఎవరికి కష్టాలు తెలియవు అంటూ తెలిపారు అందుకే పెన్షన్ ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలంటూ కూడా అధికారులకు నాయకులకు సైతం తెలియజేశానని తెలిపారు సీఎం చంద్రబాబు. పేదల జీవితంలో వెలుగు తీసుకురావాలని ఉద్దేశంతోనే తాను ఎన్నో పథకాలను అమలు చేస్తున్నానంటూ తెలిపారు
గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలు ఆనందంగా ఉంటున్నారంటూ సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2024 ఎన్నికలలో ఎన్డీఏలో భాగంగా కూటమిని గెలిపించడం మంచి పని.. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సంజీవనిగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వం వైసిపి ఏపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఇప్పుడు ఎవరడిగినా కూడా ఇచ్చే పాపాన పోలేదంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. అయినా కూడా సంపాద సృష్టించి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తానంటే సీఎం చంద్రబాబు తెలియజేశారు. మొత్తానికి సీఎం చంద్రబాబు తమ నేతలకు వార్నింగ్ ఇస్తూ వైసిపి నేతలకు ఎవరూ కూడా సహాయం చేయవద్దు అంటు తెలుపుతున్నారు.