
ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు రోజా ఈ ట్వీట్ లో చేసిన కామెంట్స్ వెనుక ఉద్దేశ్యం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు.
దీన్నిబట్టి చూస్తే జగనన్న రోజాకు హ్యాండ్ ఇచ్చాడేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది రోజా ఈ ట్వీట్ వెనుక అర్థం ఏంటి అన్నది తెలియడం లేదే అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇది ఇలా ఉండగా నిన్న ఏపీ బడ్జెట్ ప్రతిపాదనలు కేటాయింపులపై కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రోజా అంతలోనే నర్మగర్భమైన వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం అటు రాజకీయంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా వైసిపి అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజాను వదిలించుకోవాలని చూస్తున్నారా? లేక మరేదైనా అంశంపై రోజా ఇలా ట్వీట్ చేశారో తెలియక ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తానికి అయితే రోజా చేసిన ట్వీట్ పలు అర్థాలకు దారి తీస్తోందని చెప్పవచ్చు.
ఇక రోజా విషయానికి వస్తే.. వైసిపి ప్రభుత్వం అధికారం నుండి తప్పుకోవడంతో మరో నాలుగేళ్లు ఖాళీగా ఉండలేక మళ్ళీ తన నటనవృత్తిని ప్రారంభించింది రోజా. అందులో భాగంగానే జీ తెలుగులో ప్రసారమవుతున్న ఒక షో కి జడ్జ్ గా విచ్చేసింది. ఇక ఈ షో కి సంబంధించిన ప్రోమో ని కూడా ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.