- ( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ ) . . .


ఆంధ్రప్రదేశ్లో గత సాధారణ ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల ను ఆ పార్టీ ఇన్చార్జిల ను పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. ఒక నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యేను మరోచోట అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను మరోచోట ఎలా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసేసారు దాదాపు రాష్ట్రం అంతటా ఇదే జరిగింది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర తో పాటు కృష్ణా - గుంటూరు - ప్రకాశం జిల్లాలలో ఈ మార్పులు చేర్పులు ఎక్కువగా జరిగాయి. ఈ క్రమంలో నే అప్పటివరకు గుంటూరు మేయర్ గా ఉన్న కాబట్టి శివ నాగ మనోహర్ నాయుడు ను జగన్ చిలకలూరిపేట నుంచి పోటీ చేయించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి మంత్రి విడుదల రజినిపై అక్కడ తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో ఆమెను గుంటూరు పశ్చిమం కు మార్చి మనోహర్ నాయుడు ను చిలకలూరిపేట నుంచి పోటీ చేయించారు.


ఎన్నికలలో ఇద్దరు ఓడిపోయారు. ఓటమి అనంతరం విడుదల రజనీ కి జగన్ తిరిగి చిలకలూరిపేట పగ్గాలు అప్పగించగా . . . శివ మనోహర్ నాయుడు కు ఇంకా ఏ బాధ్యతలు అప్పగించలేదు. 2019 ఎన్నికలలో పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పుడు అప్పటి వరకు పెదకూరపాడు పార్టీ ఇన్చార్జిగా ఉన్న మనోహర్ నాయుడు ను జగన్ తప్పించి నంబూరు శంకరరావు కు టికెట్ ఇచ్చా.రు అలా ఎమ్మెల్యే కావలసిన మనోహర్ నాయుడు కి అవకాశం చేజారింది. పార్టీ ఓడిపోయేటప్పుడు చిలకలూరిపేట సీటు ఇచ్చారు. ఇప్పుడు ఆసిటి కూడా పీకేశారు. ఏది ఏమైనా శివ మనోహర్ నాయుడు రాజకీయ జీవితం వైసీపీలో అటు ఇటు కాకుండా పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: