
2029 నాటికి తమకు పోటీ లేకుండా కూటమి ప్రణాళికలు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. జగన్ అరెస్ట్ అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతుంది. జగన్ సైతం రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడం ఆయనకు ఒక విధంగా మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
జగన్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలంటే మాత్రం ఇకపై మరింతె లివిగా అడుగులు వేయాల్సి ఉంది. జగన్ 2029లో అధికారంలోకి రావడం కోసం ఎలాంటి పథకాలను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది. జగన్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది. ఏపీలో వైఎస్ జగన్ కు 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. జగన్ కు కార్యకర్తల సపోర్ట్ కూడా ఎంతో అవసరం అనే సంగతి తెలిసిందే.
రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అడుగులు వేయడానికి కావాల్సిన సమయం జగన్ కు ఒకింత ఎక్కువగానే ఉంది. జగన్ 2029 సంవత్సరంలో ఎలాంటి వ్యూహాలతో ముందడుగులు వేస్తారో చూడాలి. ఏపీలో కక్ష సాధింపులకు చోటు లేకుండా రాజకీయాలు కొనసాగాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నిక వైసీపీకి కీలకం కానుంది. ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడాలంటే జగన్ ప్రజలను మెప్పించేలా అడుగులు వేయాలి.