- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రావటం 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా కూటమి ఖాతాలో పడే అవకాశాలు ఉండడంతో తెలుగుదేశం పార్టీ నాయకులలో మంచి జోష్ కనిపించాలి .. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులలో ఎక్కడా కూడా ఆ ఉత్సాహం అన్నది లేకుండా పోయింది. ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి జనసేన నుంచి నాగబాబుకు ఇవ్వటం ఖరారు అయింది. మరో స్థానాన్ని బిజెపికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన మూడు స్థానాల కోసం తెలుగుదేశం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఇస్తారని అంటున్నారు. మరో రెండు స్థానాల కోసం గట్టి పోటీ ఉంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో టిక్కెట్లు త్యాగం చేసిన బుద్ధ వెంకన్న - దేవినేని ఉమామహేశ్వరరావు - పలనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాల‌పాటి శ్రీధర్ ఇలా చాలామంది అసలు పెట్టుకున్నారు.


కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ -  దేవినేని ఉమా ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు కూడా గత ఎన్నికలలో సీట్లు త్యాగం చేశారు. ఇక మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కూడా గత ఎన్నికలలో విజయవాడ పశ్చిమ లేదా అనకాపల్లి ఎంపీ సీటు అడిగి అవి రెండు దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఒకవేళ కృష్ణాజిల్లా నుంచి ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుకుంటే ఉమా లేదా బుద్ధ వెంకన్న ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా గంపెడు ఆశలతో తనకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. మరి చంద్రబాబు దయా కరుణాకటాక్షాలు ఎవరి మీద ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP