వైసిపి పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం... 11 స్థానాలకే వైసీపీ పార్టీ పడిపోవడం... ఇలా వరుసగా షాకులు తింటున్న జగన్మోహన్ రెడ్డికి వరుస అరెస్టులు కూడా తలనొప్పిగా మారాయి. పార్టీలో ఆర్థిక మూలాలు అలాగే కీలక నేతలుగా ఉన్న వారందరిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు.   ఇప్పటికే వల్లభనేని వంశీ అలాగే పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం మరో అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. మరో ఏడు రోజుల్లో అంటే వారం రోజుల్లోనే వైసీపీ పార్టీకి సంబంధించిన బడా నేత అరెస్టు కాబోతున్నట్లు సోషల్ మీడియాలో  ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.


దీంతో ఆ బడా నేత ఎవరు అనే దాని పైన చర్చ జరుగుతోంది. మద్యం కేసులో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి దొంతి రెడ్డి వాసుదేవర రెడ్డి ఇటీవల అరెస్టయ్యాడు. అరెస్టయిన అతను బెయిల్ పైన కూడా తాజాగా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.  అయితే ఈ కేసులో... వైసిపి పార్టీకి సంబంధించిన బడా నేతల పేర్లు... దొంత రెడ్డి వాసుదేవ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు... వైసీపీ పార్టీలో బడా లీడర్ గా ఉన్న  వ్యక్తి అరెస్టు కాబోతున్నట్లు చెబుతున్నారు.    


వైసీపీ పార్టీకి ఆర్థిక మూలంగా ఉన్న ఆ బడా నేతను ఈ వారం రోజుల్లో అరెస్టు చేస్తారట.  దీంతో వైసిపి పార్టీలో ఉన్న బడా లీడర్ లందరూ భయపడిపోతున్నారు. అయితే ఈ బడ లీడర్ ఎవరు అనే దానిపైన ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరిని అరెస్టు చేస్తారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. బడా లీడర్ అంటే ఆయన ఒక్కడేనని... ఆయనను అరెస్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్ని ఓకే అయితే ఆ బడా లీడర్ ఈ వారం రోజుల్లో అరెస్ట్ అవుతారట. అయితే ఎలాంటి అరెస్టులకు భయపడకూడదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నేతలు అందరికి ధైర్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: