తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో... తీన్మార్ మల్లన్న పై కాంగ్రెస్ పార్టీ... వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు అలాగే రెడ్డి నాయకులను బండ బూతులు తిట్టారు తీన్మార్ మల్లన్న. ఈ నేపథ్యంలోనే అతని పైన వేటు పడింది. ముఖ్యంగా కుల గణన చేసిన పత్రాలను... ఉచ్చ పోసి కాల్చేయాలంటూ రచ్చ చేశాడు.

 ఇక్కడే తీన్మార్ మల్లన్న అంటే అందరికీ కాలింది. అయితే తాజాగా మీనాక్షి నటరాజన్ రాగానే తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీని.. టార్గెట్ చేసి మరింత గట్టిగానే తిడుతున్నారు తీన్మార్ మల్లన్న. అంతేకాదు బీసీలతో ఏకమై కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎపిసోడ్లో మరో యాంగిల్ తెరపైకి వచ్చింది.

 తీన్మార్ మల్లన్న ఇప్పుడు గులాబీ పార్టీ నేతలను మోయడం ప్రారంభించాడు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను మెచ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు తీన్మార్ మల్లన్న అండ్ టీం. ఈ నేపథ్యంలోనే తన టీం లో పనిచేసే ఇద్దరు.... ఈ ముగ్గురు కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన లీడర్లను మెచ్చుకుంటూ వీడియో చేశారు. ఈ వీడియో గులాబీ సోషల్ మీడియా బాగానే వాడుకుంటుంది.

 మొన్నటి వరకు గులాబీ పార్టీ నేతలను తిట్టిన తీన్మార్ మల్లన్న అండ్ టీం... ఇప్పుడు మళ్లీ కల్వకుంట్ల కుటుంబాన్ని మెచ్చుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. తీన్మార్ మల్లన్న దగ్గర ఇన్ని షేడ్స్ ఉన్నాయా అని కూడా అంటున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉండి కెసిఆర్ కుటుంబాన్ని తిట్టిన తీన్మార్మల్లన్న ఇప్పుడు బయటికి రాగానే మళ్లీ.. కల్వకుంట్ల కుటుంబాన్ని... పొగుడుతున్నాడని కొంతమంది ఫైర్ అవుతున్నారు. అయితే మరి కొంత మంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీని వీడిన తీన్మార్ మల్లన్న గులాబీ పార్టీకి వెళ్తాడని కూడా ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: