ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బయోపిక్లు అనేవి ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నోసార్లు బయోపిక్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబు, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ దేవకట్టా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పలు విభిన్నమైన చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ రాజకీయ కోణం సామాజిక సమస్యలను సైతం ప్రతిబింబించే విధంగానే తెరకెక్కిస్తూ ఉంటారు.


చివరిగా రిపబ్లిక్ అనే సినిమాని తెరకెక్కించి చాలా రోజులు గ్యాప్ తీసుకొని మరి దేవాకట్టా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారట. ఉమ్మడి మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ వెబ్ సిరీస్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కాలేజీ సమయాలనుంచి స్నేహితులుగా ఉండి ఆ తర్వాత వీరి స్నేహం ఎలా మారింది. ఆ తర్వాత రాజకీయంగా ఎలా ఎదిగారు అన్నది ఈ వెబ్ సిరీస్ అన్నట్లుగా తెలుస్తోంది.


ఇక యంగ్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కలిసి యూత్ కాంగ్రెస్ లో ఎలాంటి కీలకమైన పాత్రలు పోషించారు అన్నట్టుగా తెరకెక్కిస్తున్నారట.. సీఎం చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి  నటించబోతున్నారని దివంగత మాజీ సీఎం వైయస్సార్ పాత్రలో చైతన్య రావు నటించబోతున్నారట. జెడిఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ ని తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారేటువంటి ఈ నేతల విషయంలో ఎలాంటి చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా కచ్చితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విధంగా పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన డైరెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: