
రుషికొండ దగ్గర 600 మీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ బీచ్ బ్లూ ఫ్లాగ్ గా 2020లో గుర్తించడం జరిగింది. డర్మార్కు చెందిన ఫౌండేషన్ ఈ సర్టిఫికెట్ని జారీ చేసింది.. అయితే ఈ బ్లూ ఫ్లాగ్ కలిగిన బీచ్లకు సైతం భద్రత, శుభ్రత వల్ల గుర్తింపు అందుతుందట.. విదేశీయులు కూడా ఈ పర్యటనలకు ఈ బ్లూ ఫ్లాగ్ తీరాలో వెళ్లేందుకే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో రుషికొండ ప్రాంతాన్ని సరిగ్గా పట్టించుకోకుండా గాలికి వదిలేసారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..
ముఖ్యంగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడమే కాకుండా వ్యర్ధాలు కూడా ఎక్కువగా పేరుకుపోవడం నడక మార్గాలు కూడా సరిగ్గా లేకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయట. ముఖ్యంగా ప్రజలకు అవసరమైన వాష్రూమ్స్ కూడా చాలా అద్వానమైన పరిస్థితులలో ఉన్నాయని ఫిర్యాదులు కూడా రావడంతో అంతర్జాతీయ పర్యటకులకు సైతం ఆకర్షించే అంతగా అక్కడ ఏవి ఇప్పుడు కనిపించడం లేదట. అందుకే విశాఖ బీచ్ కి సైతం బ్లూ ఫ్లాగ్ తీసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పైన దృష్టి పెట్టి ఇలాంటి ప్రత్యేకమైన బీచ్ ల ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటారేమో చూడాలి మరి.