కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చిన టి డి పి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంది. అలాగే అక్కడ కొన్ని పనులను కూడా మొదలు పెట్టింది. ఇక అదే సమయంలో టి డి పి ప్రభుత్వం రాజధాని నగరం అయినటువంటి అమరావతిని అద్భుతంగా డెవలప్ చేస్తాము అని , అక్కడ ఎన్నో అద్భుతమైన భవనాలను నిర్మిస్తాము అని చెబుతూ వచ్చారు.

ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టి డి పి పార్టీ ఓడిపోయి వై సి పి పార్టీ అధికారం లోకి వచ్చింది. ఇక వై సి పి పార్టీ కేవలం అమరావతి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఉండాలి అనే ప్రతిపాదనను తీసుకు వచ్చింది. దానితో అమరావతి డెవలప్మెంట్ చాలా వరకు ఆగిపోయింది. ఇక తాజాగా టి డి పి , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.

ప్రస్తుతం టి డి పి , జనసేన , బి జె పి మూడు పార్టీలు కూడా అమరావతి డెవలప్మెంట్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టి డి పి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి భవనాలను నిర్మిస్తామో అని చెప్పిందో ఇప్పుడు అలాంటి భవనాలను నిర్మించడానికి అలాంటి అడుగులు కూటమి ప్రభుత్వం వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏకంగా అమరావతి డెవలప్మెంట్ కోసం లక్ష కోట్లను ఖర్చు చేయాలి అని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయినట్లు అందుకోసం ప్రస్తుతం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: