ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో.. జనసేన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోటీచేసిన అన్నిచోట్ల విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ సంపాదించింది జనసేన పార్టీ. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయిన తర్వాత... కూటమి కారణంగా అధికారంలోకి వచ్చింది. అంతేకాదు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి రావడమే కాకుండా... జనసేనకు రెండు మంత్రి పదవులు వచ్చాయి.

 అటు బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో.. కేంద్ర పదవుల్లో కూడా జనసేనకు అవకాశాలు దక్కే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇలాంటి సక్సెస్ ఊపులో ఉన్న జనసేన.. పార్టీ ఆవిర్భావాన్ని జరుపుకోనుంది. మార్చి 14వ తేదీ న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఈ కార్యక్రమం నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారట పవన్ కళ్యాణ్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.

 పిఠాపురం నియోజకవర్గం లేదా కాకినాడలో  జనసేన పార్టీ బహిరంగ సభ ఉండబోతుందని చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు అలాగే నేతలకు దిశా నిర్దేశం చేయబోతున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.  ముఖ్యంగా కూటమిలో ఉన్న గొడవలను పక్కకు పెట్టి... టిడిపి కార్యకర్తలు అలాగే నేతలతో కలిసి వెళ్లాలని జనసేన పార్టీ నాయకులకు దిశనిర్దేశం చేసే ఛాన్సులు ఉన్నాయి.

 అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా... చంద్రబాబు సైడ్ అయిపోయి నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగిస్తే... కాంప్రమైజ్ కావాలని... జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ ముఖ్య లక్షమని... సీఎం పదవి కాదని జనసేన అధినేత పవన్... ప్రకటించబోతున్నారట. కూటమి ప్రభుత్వాన్ని... ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగించాల్సిందేనని చెప్పబోతున్నారట. మరి పవన్ కళ్యాణ్ ఇలాంటి స్టేట్ మెంట్ చేస్తే... జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: