ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైజాగ్ రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలోని భూములకు రెక్కలు రావడంతో పాటు భూముల ధరలు ఆకాశాన్ని తాకే స్థాయిలో పెరిగాయి. అయితే ఏపీలో అధికారం మారిన తర్వాత ఈ పరిస్థితి కూడా పూర్తిస్థాయిలో మారిపోయిందనే సంగతి తెలిసిందే.
 
దేశంలోని ప్రధాన నగరాలలో విశాఖ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రివర్స్ లో జరుగుతోందని తెలుస్తోంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ బాగానే ఉండగా విశాఖలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అమ్మకాల విలువ విషయంలో విశాఖ వృద్ధి రేటు అంతకంతకూ తగ్గుతుండటం కూడా సోషల్ మీడియలో హాట్ టాపిక్ అవుతోంది.
 
విశాఖలో రియల్ బూమ్ తగ్గడం వెనుక కారణాలు ఏంటనే చర్చ మొదలు కాగా చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో రియల్ బూమ్ పెరగడానికి విశాఖకు పూర్వ వైభవం రావడానికి ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తుందో చూడాల్సి ఉంది. విశాఖలో ప్రస్తుతం ఎన్నో ప్రముఖ ఐటీ కార్యాలయాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. విశాఖను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఏపీ సర్కార్ పై ఎంతో ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.
 
వైజాగ్ కు సంబంధించి రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి పూర్తిస్థాయిలో మారాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశాఖ అభివృద్ధి కోసం కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంటూ తెలివిగా అడుగులు వేస్తోంది. అయితే అమరావతికి కూటమి సర్కార్ ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చిందో విశాఖకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో కూటమి సర్కార్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు తన విజన్ తో రాష్ట్రంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడతారో చూడాల్సి ఉంది.




 


మరింత సమాచారం తెలుసుకోండి: