ఏపీలోని రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. ముఖ్యంగా అధికార పార్టీ ఏ వైపుగా ఉంటే ఆ వైపు గానే నేతలు పార్టీలు మారుతూ ఉంటారు. అలా ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం హవా నడుస్తోంది. కాబట్టి ఆ వైపు గానే చాలామంది నేతలు ఇతర పార్టీలలో నుంచి వెళ్లడం జరుగుతోంది. కానీ అధికార పార్టీ ఎవరిది ఉంటే వారు రాజీనామా చేయడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.


అయితే ఆంధ్రాలో సీఎం చంద్రబాబుగా ఉన్నప్పటికీ కూడా తన సొంత జిల్లాలో ఒక బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పలమనేరు రూరల్ పరిధిలో ఉండే కులమానస సెగ్మెంట్ 2 ఎంపీటీసీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి తన రాజీనామా పత్రాన్ని కూడా ఎంపీడీవో ఖాదర్బాషాకు కూడా తన లెటర్ ని అందజేశారట. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఈయన జడ్పిటిసిగా గెలిచారట. మంచి వ్యక్తి కావడంతో పాటుగా చదువుకున్న వ్యక్తి అవడంతో ప్రజలు ఆయనను ఎన్నుకోవడం జరిగింది కానీ కొన్ని కారణాల చేత తన పదవికి రాజీనామా చేశారట.


అయితే పలమనేరు రూరల్ సెగ్మెంట్ 2 లో గత కొన్ని ఏళ్లుగా టిడిపి నేతలు మధ్య కొన్ని వర్గ విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా టిడిపి నేతలతో పాటు కార్యకర్తలు కూడా విడిపోయినట్లు సమాచారం. అందుకే జెడ్పిటిసి అయిన లక్ష్మీనారాయణ కూడా తన పదవికి రాజీనామా చేశారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తన సొంత జిల్లాలోనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా హామీలను ఏ విధంగా నెరవేరుస్తారో చూడాలి. ఇప్పటికే ప్రజలను కొంతమేరకు కూటమి ప్రభుత్వంపై అసహనం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: