
ఉత్తమ దర్శకుడు అవార్డ్ సీన్ బేకర్ కు అనోరా మూవీకి దక్కింది. ది రియల్ పెయిన్ సినిమాలో నటించిన కీరన్ కైల్ కల్కిన్ కు ఉత్తమ సహాయ నటుడి అవార్డ్ దక్కడం కొసమెరుపు. ఎమిలియా పెరేజ్ ప్రాజెక్ట్ కు జోయా సాల్దానాకు ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. ఉత్తమ స్క్రీన్ పెలి విభాగంలో అనోరా సినిమాకు సీన్ బేకర్ కు అవార్డ్ దక్కడం గమనార్హం. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే పీటర్ స్ట్రాగన్ కు కాన్ క్లేవ్ సినిమాకు దక్కింది.
పాల్ తేజ్ వేల్ కు ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్ అవార్డ్ దక్కగా ఉత్తమ మేకప్, హెయిర్ స్టైల్ విభాగంలో ది సబ్ స్టాన్స్ సినిమాకు దక్కింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో సీన్ బేకర్ కు అనోరా సినిమాకు మరో అవార్డ్ దక్కింది. లాల్ కాల్రేకు బ్రూటలిస్ట్ సినిమాకు, డ్యూన్ పార్ట్2 కు, ఎమిలియా పెరేజ్ కు ఎల్ మాల్ సినిమాకు, వాల్టర్ సాల్లెస్ కు ఐయామ్ స్టిల్ హియర్ ప్రాజెక్ట్ కు, డానియల్ బ్లెమ్ బర్గ్ కు ది బ్రూటలిస్ట్ సినిమాకు, వికెడ్, ఐయామ్ నాట్ ఏ రోబో, ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా, నో అదర్ ల్యాండ్, ఫ్లో, ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్ లకు అవార్డులు దక్కాయి. 2025 ఆస్కార్ విజేతల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.