ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఏవైతే హామీలను చెప్పారో వాటిని అమలు చేయకపోవడంతో కొంతమేరకు వ్యతిరేకత మొదలవుతోంది. దీంతో ఇటీవలే బడ్జెట్ సమావేశాలలో కొన్ని హామీలను సైతం అమలు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కొన్ని హామీలను సైతం చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టేందుకే సన్నహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇంత ఇస్తానని చెప్పి ఇప్పుడు తగ్గించారనే విధంగా టిడిపి అనుకూల మీడియాలు రాసేవట.


అయితే ఇప్పుడు తాజాగా వైసిపి పార్టీ ఛానల్ రాసుకు వస్తున్నటువంటి విషయానికి వస్తే.. బాబోరు ఎగ్గొట్టిన హామీల విలువ అంటూ రాసుకొచ్చారు.. ఇందులో ప్రధానమైనటువంటి అంశం విషయానికి వస్తే.. రెండు బడ్జెట్లలో బాబు ఎగరగొట్టిన హామీలంటు.. నిరుద్యోగ భృతి 57,670 కోట్లు అంటూ ఏడాదికి అంటూ..1.6 కోట్లకు పంగనామం పెట్టారంటో తెలిపారు. ఆడబిడ్డ నిధి అంటు..28,000 కోట్లు ఏడాదికి అవసరం అంటూ.. రెండుసార్లు కలిపి 57, 600 ఎగ్గొట్టారంటూ తెలిపారు. తల్లికి వందనం పథకం కింద ఏడాదికి 13,111 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని రాసి కొచ్చారు. అయితే ఇప్పుడు కేటాయించింది 9,000 కోట్లు అంటూ తెలిపారు. దీపం పథకం కింద ఏడాదికి  అవసరం 4 వేల కోట్లు


అన్నదాత సుఖీభవ కు సంబంధించి మొదటి ఏడాది.. ఏడాదికి 10,700 కోట్లు కేటాయింపు ఉండగా.. కానీ కేటాయించింది 6,300 కోట్లే అంటూ తెలిపారు. కోత 4,000  కోట్లకు పైగా అంటూ తెలిపారు. మొత్తం మీద 22 లక్షల మందికి పైగా ఎగనామం పెట్టబోతున్నారంటూ తెలిపారు. అలాగే ఉచిత బస్సు ఏడాదికి అవసరమయ్యే 3,182 కోట్లు అవసరం కాదా.. కేటాయించింది సున్నా 100% వరకు మోసం చేశారని తెలిపారు. రోజుకి 20 లక్షల మందికి ఎగనామం. దీపం పథకం కింద ఏడాదికి.. అవసరం 4 వేల కోట్లు.. కేటాయించింది 2600 కోట్లు.. కోత 13,999 కోట్లు అంటూ రాసుకు వచ్చారు. 58 లక్షల మందికి ఎగనామం పెట్టారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: