ఏపీ అసెంబ్లీ హాల్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం నిన్న జరిగింది .. అయితే ఈ సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు చేశారు .. అధికారంలో ఉన్నా మనము ఏదైనా పొరపాటుగా మాట్లాడితే విపక్షం దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలకు ప్రజలకు కేడార్‌కు మధ్య సమన్వయం పెరగాలని పార్టీ నేతలకు సూచించారు. అలాగే ఈ సందర్భంగా చీఫ్ విప్ ఆంజనేయులు , బుచ్చ‌య్య‌ చౌదరి నియోజకవర్గ నిధులు ఇవ్వాలని కోరారు ..


దాని పై స్పందించిన చంద్రబాబు ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని కూడా చెప్పారు .  అలాగే కేంద్ర బడ్జెట్ తరహాలో రాష్ట్ర బడ్జెట్ పై కూడా విస్తృతమైన చర్చ జరగాలన్నారు వేస‌విలో అనారోగ్య కేసులపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా చంద్రబాబు సూచించారు. అలాగే సీనియర్ నేతలకు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసు .. కానీ కొత్త వాళ్లు కూడా తెలుసుకోవాలన్నారు సీఎం .. అలాగే అందరూ కలిసి కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కూడా స్పష్టం చేశారు .  సమైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో కూడా అందరూ తనను రావద్దని చెప్పారని చివరకు గురజాల ఎమ్మెల్యే య‌రపతినేని శ్రీనివాసరావు భారీ మీటింగ్ ఏర్పాటు చేసి త‌ను ఆహ్వానించారు అని కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.


అలాగే ఆ సమయంలో య‌ర‌ప‌తినేని ఏర్పాటు చేసిన ఆ మీటింగ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టమని అన్నారు .. ఆ సమయంలో ప్రత్యర్థుల కుట్ర‌ల‌ను కూడా య‌రపతినేని సమర్థవంతంగా తిప్పి కొట్టారని బాబు అభినందించారు .. అయితే ఇప్పుడు నామినేట్ పోస్టులు భర్తీ పై చంద్రబాబు ఓ క్లారిటీ ఇచ్చారు . మార్చ్ చివ‌రిక‌ల్ల‌ నామినేట్ పదవుల భర్తీ చేస్తామని సీఎం అన్నారు .. అలాగే సాధికారిక కమిటీ సభ్యులకి నామినేట్ పదవులని ఆయన తేల్చి చెప్పారు .. అలాగే మార్కెట్ యార్డులు , దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలని సూచించారు .. ఇక పార్టీ పదవులు మహానాడులోపు పూర్తి చేయాలన్నారు .. ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడే స‌మ‌యంలో జాగ్రత్తగా ఉండాలని అలాగే అనవసరమైన విషయాల్లో మాట్లాడొద్దని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు.

మరింత సమాచారం తెలుసుకోండి: