ఆంధ్రప్రదేశ్లో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది .. ఇప్పటికే ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్ , టీచర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఓట్లు లెక్కింపు జరుగుతుంది .. ఈరోజు రాత్రికి వీటి ఫలితాలు కూడా రానున్నాయి .. ఈ లోపే శాసనమండలిలో మరో ఐదుగురు ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో వారి రిటైర్మెంట్ పై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు .. ఈ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
 

ఇక ఈనెల 29న ఏపీ శాసనమండలిలో ఐదుగురు సభ్యులు రిటైర్ కాబోతున్నారు .. ఇక వారీలో జంగా కృష్ణమూర్తి , దువ్వవరపు రామారావు , అశోక్ బాబు, బీటీ నాయుడు , యనమల రామకృష్ణ ఉన్నారు .  ఇక వీరి రిటైర్మెంట్ ..  ఎమ్మెల్సీ సీట్ల ఖాళీ పై ఇవాళ మండలి లో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది .. అలాగే వీరి రిటైర్మెంట్ ను మండలి నోటి ఫై చేశాక ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటం తో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు .. ఇక దీంతో ఈ ఐదుగురు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమవుతుంది.

 

ఇప్పటికే ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వాహనకు ఎలక్షన్ సంఘం షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది .. ఇక దాని ప్రకారం ఇవ్వాల ఈ ఐదు సీట్లలో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది .. అలాగే అనంతరం నామినేషన్ స్వీకరణ కూడా మొదలవుతుంది .. ఇక ఈనెల 10 వరకు నామినేషన్ సేకరిస్తారు .. ఆ తర్వాత మార్చ్ 11న నామినేషన్ పరిశీలన ఉంటుంది .. ఆ తర్వాత మార్చ్ 13న నామినేషన్ ఉపసంహరణ చూసుకోవచ్చు .. ఇక మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు .. అలాగే అదేరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపెట్టి ఫలితాలు రిలీజ్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: