
అయితే ఇదే హవా మిగిలిన రౌండ్ లో కూడా కొనసాగితే మొదటి ప్రాధాన్యత ఓటుల లోనే ఆలపాటి విజయం కన్ఫామ్ అవుతుంది .. ఒక ఓటు ఎక్కువ వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు రాదు .. మొత్తం పోలైన ఓటల్లో 50 % సాధించాలి .. లేకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లని కూడా లెక్కబెడుతారు .. ఈ సమయంలో ఒక్క రౌండ్లో నే పదివేల ఓట్ల ఆధిక్యం సాధించడం తో దానిని అధిగమించటం .. పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కు అంత తేలిక కాదన్న వాదన కూడా వినిపిస్తుంది .
అయితే వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ పెట్టలేదు .. అయితే ఆ పార్టీ పరోక్షం గా పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కోసం గట్టి గా పని చేసింది .. అయినా గత రెండుసార్లు పిడిఎఫ్ అభ్యర్థి గా గుంటూరు , కృష్ణా జిల్లాల నుంచి లక్ష్మణరావు గెలిచారు .. అయితే ఇప్పుడు ఈసారి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూటమీ నుంచి పోటీకి దిగారు .. అప్పటి నుంచి ఆయన ప్రణాళిక బద్ధంగా పని చేసుకున్నారు . ఆ ఫలితం ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల్లో గట్టి గా కనిపిస్తుంది .