ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊపిరి పీల్చుకునే శుభవార్త అందింది. తొమ్మిది నెలలుగా జీఎస్టీ వసూళ్లలో తీవ్ర నిరాశను చవిచూసిన రాష్ట్రానికి ఊరట లభించింది. మైనస్‌ వృద్ధి రేటుతో సతమతమవుతున్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు కాస్త ఉపశమనం కలిగింది. ఎట్టకేలకు జీఎస్టీ వసూళ్లు గాడిన పడ్డాయి. ఫిబ్రవరి నెలలో ఏకంగా 4% వృద్ధి నమోదు కావడం విశేషం.

ఐతే, ఈ ఆనందాన్ని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష అనుకూల మీడియా సంస్థలు ఈ 4% వృద్ధిని కూడా తక్కువ చేసి చూపించేందుకు చాలా ప్రయత్నిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వృద్ధి తక్కువగా ఉందని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతుంటే ఏపీ మాత్రం ఇంకా వెనుకబడి ఉందని తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాయి.

వాస్తవానికి గత తొమ్మిది నెలలుగా చూసుకుంటే.. ఒకే ఒక్క నెల మినహా అన్ని నెలల్లోనూ మైనస్ వృద్ధి రేటే నమోదైంది. కొన్ని నెలల్లో అయితే -4%, -7%, -10% వరకూ పడిపోయింది. మధ్యలో ఒక్క నెల మాత్రం ప్లస్ వచ్చింది. అయితే అది కూడా సంక్షేమ పథకాల బిల్లులు, రిజిస్ట్రేషన్ల హడావుడితో వచ్చిందే తప్ప నిజమైన వృద్ధి కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక మొన్నటి నెలలో అయితే వృద్ధి రేటు దాదాపు శూన్యం. గతేడాది కంటే కేవలం 38 కోట్లు మాత్రమే ఎక్కువ వసూలు అయ్యాయి. డిసెంబర్ నెలలో రిజిస్ట్రేషన్లు పెరగడం వల్ల జనవరిలో ఆ ప్రభావం కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

కానీ ఫిబ్రవరిలో మాత్రం అలాంటి హడావుడి ఏమీ లేదు. సంక్షేమ పథకాల డబ్బులు విడుదల చేయలేదు. రిజిస్ట్రేషన్ల తంతు లేదు. ఏ విధమైన కృత్రిమ కారణాలు లేకుండానే 4% వృద్ధి నమోదు కావడం నిజంగా శుభ సూచకం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడుతోందని చెప్పవచ్చు. ఇది రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా వరుస పరాజయాలతో నిరాశలో కూరుకుపోయిన వారికి ఈ 4% వృద్ధి కాస్త ఊరటనిచ్చే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: