ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో ఇటీవలే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం జరగడం జరిగింది.. గత నెల 27వ తేదీ జరగగా నిన్నటి రోజు నుంచి కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. దీంతో ఎవరు గెలుస్తారన్న విషయం ఇప్పుడు అందరినీ ఆత్రుతకు గురిచేస్తోంది. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలోని పట్టుభద్రుల ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ విజయాన్ని అందుకున్నారట. ఏడవ రౌండ్ ముగిసేసరికి 1,18,070 ఓట్లు ఉన్నాయట.. అయితే మొత్తం మీద 2,41,491 ఓట్లు పోలయ్యాయని ఏడో రౌండ్ పూర్తిగా అయ్యేసరికి 21,577 చల్లని ఓట్లుగా గుర్తించారట.


దీంతో 50 శాతం పైగా ఓటు ఆలాపాటి రాజేంద్ర సాధించడంతో విజేతగా ప్రకటించారు. ఇక తొమ్మిదవ రౌండ్ వచ్చేసరికి 1,45,057 ఓట్లు వచ్చాయట. అయితే.. మరొక ప్రత్యర్థి 62,737 ఓట్లు సాధించారు. చివరి ఓట్లు ముగించేసరికి ఆలపాటి రాజాకు 82,320 ఓట్లు మెజారిటీ దక్కడం జరిగిందట.  కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రతి రౌండ్ లోను ఆదిత్యం ప్రదర్శించారట. గుంటూరులోని ఏసి కళాశాలలో నిన్నటి రోజున ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు జరుగుతున్నది.


మొత్తం మీద అక్కడ 2,41,491 ఓట్లు సైతం పోలయ్యాయి మొత్తం మీద 9 రౌండ్లలో లెక్కించడం జరిగిందట. బ్యాలెట్ పద్ధతి కావడం వల్ల బరిలో 25 మంది అభ్యర్థులు ఉండి మరి లెక్కించినట్లు తెలుస్తోంది. అయినా కూడా ఎక్కువ సమయమే తీసుకున్నది. అయితే అక్కడ నిలబడిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు మాత్రమే కొంతమేరకు ఓట్లను సాధించగలిగారట. మిగిలిన వారందరూ కూడా పెద్దగా ఓట్లను నామమాత్రంగానే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఓట్ల లెక్కింపు కేంద్రానికి సైతం టిడిపి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తో పాటుగా పలువురు నేతలు కూడా వచ్చి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు వెల్లడించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: